Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..! 14 d ago

8K News-18/03/2025 దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా ఫైనాన్షియల్, మెటల్ స్టాక్స్ కొనుగోళ్ల మద్దతు కలిసొచ్చింది. దీంతో వరుసగా రెండోరోజూ సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 1200 పాయింట్ల మేర లాభపడగా.. 75,385.76 గరిష్ఠాన్ని తాకింది. చివరికి 1131.31 పాయింట్లు లాభపడి 75,301.26 వద్ద ముగిసింది. నిఫ్ట్యీ 325. 55 పాయింట్లు లాభపడి 22,834.30 వద్ద స్థిరపడింది.